ఎంత గడసరివే
క్రీగంట కనులతో
వలపులే విసురుతావు...
కొంటెతనం రంగరించి
కన్నే గీటుతావు...
వినిపించని
సవ్వడులెన్నో
పెదాలపైనే
చూపిస్తావు...
మనసు రొదలన్నీ
కవ్వింతలలోనే
చూపిస్తావు...
మౌనగీతంలో
వలపు వీణను
సవరిస్తావు...
భావమే లేని పాటలో
విరహభావం రగిలిస్తావు...
నలుగురిలో నేనున్నా
ఒంటరినే నేనయినా
అదేమీ పట్టని నీవు
వలపు బాణాలు
వేస్తుంటావు...
మనసు పుష్పాల తాకిడికి
నేను
తికమక పడిపోతే
విజయదరహాసం
చిందిస్తావు ...
అది చూసిన నేను
అయోమయంలోకి జారుకుంటే
గులాబీ రేకుల పెదాల
ఆహ్వానంతో
అలజడులే రేపుతావు...
మయూర నడకతో
అందియల రవళితో
మనోసంద్రంలో సునామీలే
పుట్టిస్తావు...
నిజంగా నువ్వెంత
గడసరివో
మనస్వినీ...
నా గడుసు తనం అంతా నీతోనే కదా గడసరి.....అందరిలో నిన్ను చూసి కన్ను కొట్టిన వేళ నువ్వు నీ పెదాలపై ఎక్కడ అందరు గమనిస్తారో అని ఆ నవ్వును కంగారును దాచి పెట్టడానికి చేసే విశ్వ ప్రయత్నం అందులో నువ్వు ఫెయిల్ అయి బుంగమూతి పెట్టి ప్రదర్శించే చిరుకోపం...ఎవరు లేనప్పుడు ఇచ్చే మొట్టికాయ నాకు ఇష్టం అందుకే ఆ అల్లరి....వద్దంటే ఎలా మన్మధ...(వాణి శ్రీవిద్య )
ReplyDelete