నేనూ మనిషినే
కనుల నిండా నీరు
కావాలి...
మనసు నిండా బాధ
కావాలి...
గుండె నిండా వేదన
కావాలి...
నీరు ఒలకని కన్నులు
ఎందుకు...
బాధ లేని మనసు
ఎందుకు...
వేదనే లేని గుండె
ఎందుకు...
స్పందన తెలియని మనసు
ఒకరి కోసం వేదన పడని
గుండె
మనసైన మనిషి కోసం
చెమర్చని నయనాలు
ఎందుకూ పనికి రాని
ప్రయాసలు...
నా కళ్ళు కన్నీరు
కురిపిస్తాయి
నా మనసు స్పందించి
నా గుండె రోదించి
మనో తటాకం
అల్లకల్లోలం అయిన వేళ
ఆ వేదనా తరంగాలు
కన్నీటి ధారలుగా
ఉబికివస్తాయి...
ఎందుకంటే
నేనూ మనిషినే
నాకూ మనసుంది...
heart touching lines
ReplyDeleteThanks padmarpithaji...
Deleteథాంక్యూ అండీ ....
Deleteheart touching lines
ReplyDelete