సింహగర్జన
కన్నులనే కాగడాలుగా
మలుచుకుని
చీకటి సమరంలో కదం
తొక్కుతా...
మంచుగడ్డ మనసునే శిలగా
మార్చి
భావనలనే బాణాలుగా
విడుస్తా ...
గుండెను బండరాయిని
చేసి
అక్షరాలనే అగ్ని
శిఖలను చేస్తా...
తెల్లపూల సోయగాలను
ఎర్రమల్లెలుగా పూయించి
కలాన్ని కరవాలం చేస్తా...
నిప్పులు కురిపించే
సమాజంపై
సుడిగాలినై
తిరగబడతా...
చదరంగం ఆడే కుటిలంలో
విజేతను నేనై
అవతరిస్తా...
పడి లేచిన కెరటాన్నై
ఉప్పెనలా
దూసుకువస్తా...
నిశి చీకటిలో పొద్దుపోడుపునై
చీకటి బతుకులో వెలుగు
రేఖను నేనవుతా...
చిదిమేసిన లోకంపై
తిరుగుబాటును
నేనవుతా...
హాస్యమాడే పెద్దలకు
చెంపపెట్టును
నేనవుతా...
పెదవి విరుపు లోకంలో
చిరునవ్వును నేనే
అవుతా...
మొరిగే కుక్కలకు
సింహగర్జన నేనవుతా...
కసికాలం విడిచిపోయినా
కాలచక్రం తిరగరాస్తా...
awesome brother.
ReplyDelete