నా కంటిపాప
కంటి తెరలపై నిత్యం
నర్తించే
సుందర స్వప్నం నీవు...
కనురెప్పలలో ఇమిడిపోయే
చందమామవు నీవు...
కంటి నుండి జాలువారే
నులివెచ్చని సుడివి
నీవు...
మనోతటాకంలో
సవ్వడి రేపే చిన్నారి
అలవు నీవు...
గుండెలోతుల్లో
వినిపించే
మూగ వీణవు నీవు...
ఎద కనుమల్లో విరిసిన
నవ వసంతం నీవు...
నా అణువణువులో నిండిన
అమృతగానం నీవు...
నాకనుల నీటి ధారలో
జారిపోకు నెచ్చెలీ...
నా కంటిపాపగా
చూసుకుంటాను నిన్ను...
No comments:
Post a Comment