శిలాశాసనం...
ఇసుక మీద రాతలు కాదు
నా అక్షరం ...
గాలిమీద బుడగలు కాదు
నా అక్షరం ...
మనసు గుడిలో వెలిగే
దీపమే
నా అక్షరం...
కంటి కొలనులో రాలిపడిన
నీటి చుక్క
నా అక్షరం...
బాధ్యతల సమరంలో
రాలిపడిన రుధిరం చుక్క
నా అక్షరం...
ఊపిరిలో ఊపిరిగా శ్వాస
నింపే ప్రాణవాయువు
నా అక్షరం...
నిశి చీకటిలో వెలుగును
నింపే కన్నుల దివిటీ
నా అక్షరం...
జనియించిన నా ప్రతి
అక్షరం జ్వలిస్తుంది
మనసైన మనసుకోసం
పరిమళిస్తుంది...
మనసే కాదని అంటే నా
అక్షరం
వాడిన వసంతమే
అవుతుంది...
పువ్వులా పరిమళించినా
ఎడారిలా ఎండిపోయినా
నీటి సుడులుగా
ప్రవాహించినా
సుడిగాలిలో
చెదిరిపోయినా
అర్ధమే మారనిది
నా అక్షరం...
నా ప్రతి అక్షరం
నా మనసు మాటకు ప్రతిరూపం...
నా ప్రతి అక్షరం నిత్య
శిలాశాసనం...
అందుకే నా అక్షరం
ఆ అందమైన మనుసుకే
అంకితం...
No comments:
Post a Comment