నేనంటే నేనే...
నేనంటే నాకు
చచ్చేంత ప్రేమ
అందరిలా కాదు నాలా బతుకుతున్నందుకు నేనంటే నాకు ఆకాశమంత అభిమానం
భావాలపూదోటలో విహరించే నేనంటే నాకు గులాబీలంత ఇష్టం
విలువలను వలువలుగా మార్చని నేనంటే నాకు దేవుడంత పారవశ్యం
నేనంటే నాకు చంపేసేంత ద్వేషం
అందరిలా కాలేకపోయిన నేనంటే నాకు ఎంతో కోపం
తోటివారు ఆకాశంలో విహరిస్తున్నా నేల మీద పాకుతున్న నేనంటే నాకు అసహ్యం
అందుకే ఇంకా
ప్రేమా ద్వేషాల గమనంలో అలసిన బాటసారిలా నడుస్తున్న నన్ను నేను ప్రేమిస్తూనే అసహ్యించుకుంటున్నా