ఆ ఒక్క
క్షణం
వీనుల విందుగా
వినిపిస్తున్న సంగీతం
ఆ
గీతంలో లీనమై మైమరిచిన వేళ
మెల్లగా
ఆ సంగీతం చెవులకు దూరంగా
జారుతున్న
అనుభూతి
నిశబ్దమేదో
మెదడును ఆవహిస్తున్నట్లు
తేజోమయ
వెలుతురు మసక బారుతున్న దృశ్యం
అంతా
మసకమసకగా ఉంది
ఎదురుగా
నువ్వున్నావు
నీ
రూపమూ కరుగుతోంది మెల్ల మెల్లగా
ఏదో
జరుగుతోంది
ఏం
జరుగుతున్నదో గాని తెలియని వైనం
ఏదో
తెలియని అలికిడి
ఎదలోతుల్లో
ఎక్కడో తెలియని ప్రకంపనలు
మెరుపువేగంతో
గుండెలోకి దిగింది ఊపిరి
ఒక్కసారిగా
కుదుపు
భారీ
భవనమేదో కుప్పకూలినట్లు
గుండె
కవాటాలను మూసేసిన శ్వాస
బయటకు రాలేనంటూ
మొండికేసింది
స్పందనలు
కోల్పోయిన హృదయం
ఇంకా
పోరాడుతూనే ఉంది ఆగిపోవటం ఇష్టం లేక
నాలోకం
స్తంభించిపోయిందనిపించింది
నాకు
తెలిసిపోతోంది ఏం జరుగుతున్నదో
అప్పుడే
నన్ను చూసిన నువ్వు
ఒక్క
ఉదుటున నన్ను చేరావు
కలవరపాటుకు
గురైనా నిబ్బరం కోల్పోక
హృదయమైదానంపై
సపర్యలు చేసావు
మనసు
కలత చెందినా
సమయస్పూర్థిని
చూపుతున్న నువ్వు
గారాలపట్టిని
పిలిచావు
చాలనిపించింది
నా
వాళ్ళు నాతోనే ఉన్నారనిపించింది
నీ
ప్రేమకు చలించిందో
నీ
ఆవేదనకు కరిగిందో
తెలియదుగానీ
నా
శ్వాస ఒక్కసారిగా బయటకు ఉబికింది
గుండె
కుదుటపడింది
స్రవిస్తున్న
నయనాలు నిన్ను ఆర్తిగా చూసాయి
బేలగా
మారిన తనయను
కంటి
చూపులు ముద్దాడాయి
అప్పుడే
గదిలోకి వచ్చిన ప్రిన్స్ ను గర్వంగా చూసాయి
కనులముందు
మీరు ముగ్గురూ ఉంటే
నాకేమయినా
పరవాలేదనిపించింది ఆ క్షణం
ఆ ఒక్క
క్షణం నాకు
మళ్ళీ
జన్మించిన అనుభూతి మిగిలింది
మనస్వినీ