వ్యాపార కేంద్రం కాదు ఈ మనసు
మంచు శిలను కాదుగా నేను
చిరుగాలికే
కరిగిపోయేందుకు
బండరాయిని కాదుగా నేను
ఎండ వేడికి
పగిలిపోయేందుకు
ఆటబొమ్మను కాదుగా నేను
పరుల క్రీడకు నర్తించేందుకు
వ్యాపారం చేయలేదుగా
నేను
లాభ నష్టాలు బేరీజు
వేసుకునేందుకు
పిరికిపందను కానుగా
నేను
తాటాకు చప్పుళ్ళకు
బెదిరేందుకు
బలహీనుడిని కాదుగా
నేను
మొసలి కన్నీళ్ళకు పడిపోయేందుకు
వంచకుడిని కాదుగా నేను
పట్టుకున్న చెయ్యి
విడిచిపెట్టేందుకు
అవిశ్వాసుడను కాదుగా
నేను
షరియత్ ను అపహాస్యం
చేసేందుకు
నాకు అన్నీ తెలుసు
ప్రతి మనసూ తెలుసు
ప్రతి ఆటా తెలుసు
ఆటలో బొమ్మలూ తెలుసు
రాజనీతి శాస్త్రం
చదివిన నాకు
రాజకీయాలు తెలుసు
రాజకీయం చేయడమూ వచ్చు
రాజకీయాలను
తిప్పికొట్టడమూ వచ్చు
నా నడకలో మార్పు లేదు
నడతలో మార్పు లేదు
మనసులో మార్పు రాదు
ఎవరికోసమో చెయ్యిపట్టుకోలేదు
ఎవరి కోసమో చెయ్యి
వదిలేదీ లేదు
సునామీలు వచ్చినా
బెదిరేది లేదు
ఎవరు చచ్చినా కరిగేదీ
లేదు
నేను రాసుకునే అక్షరాల
మీద ఆన
నా ప్రాణం తోనే నన్ను
వీడిపోతుంది
నా మనస్విని
No comments:
Post a Comment