అంతర్యామీ...
ఈ దేహము నాకు వద్దు
నువ్వే తీసుకుపో
నా అంతరాత్మను మాత్రం
నాకే వదిలేయ్…
మకిలి అంటిన దేహంపై
మమకారము లేదు నాకు
నేరము తెలియని
అంతరాత్మే నాకు ముద్దు…
పెరుగుతున్న వయస్సు
తరుగుతున్న చందానా
కవళికలు మార్చుకునే ఈ
దేహం ఇప్పుడు శుష్కించిపోయింది…
జీవనయానంలో పడిలేస్తూ
ఒడిదుడుకుల దేహం ఏనాడో
కుంగిపోయింది
కంటికి కనిపించే దేహం
కంటగింపుగా మిగిలిపోయింది…
పడిలేచినా లేచి పడినా
చెదరనిదీ కరగనిదీ నా
అంతరాత్మే…
నాకంటే నాకెంతో
ఇష్టమైన నా అంతరాత్మను
నాకే వదిలేయ్
ఎందుకంటే అదినా
అంతరాత్మ…
నడిచే అడుగుల పయనం
ఆపేయ్
నా గమ్యాన్ని మాత్రం
మార్చకు
నా గమ్యాన్ని నా మనసు
నిర్దేశించింది…
అడుగులు ఆగినా
పయనం జారినా
నా గమ్యం నా అంతరాత్మే…
అంతర్యామీ
అంతరాత్మను నాకు
వదిలేయ్
ఈ దేహము నాకు వద్దు
నువ్వే తీసుకుపో...
No comments:
Post a Comment