కమ్మని సంతకం
ఆ క్షణం
....
మనసు తెరపై అన్నీ మాయమైనట్లు...
ఆలోచనలన్నీ కరిగిపోయినట్లు...
మనసును ప్రభావితం చేసిన
అంశాలన్నీ రాలిపడిపోయినట్లు...
వేదనలన్నీ ఒక్కొక్కటిగా
గాలికి కొట్టుకుపోతున్నట్లు...
మనసు కాన్వాసుపై
సరికొత్త చిత్రమేదో
రంగులు అద్దుకుంటున్నట్లు...
అవును ఆ క్షణం అనిర్వచనీయ భావమేదో
నా చుట్టూ వలయమై
తారాడుతూ ఉంటుంది...
నీ నుదుటిపై నా పెదాలతో
చేసే కమ్మని సంతకం ఆ క్షణం...
No comments:
Post a Comment