మనసా కవ్వించకే
నిదురించిన
మనసును
మెత్తగా
తడుముతావు
చిరుసందేశమై
మెల్లగా తట్టి
లేపుతావు
మరణించిన
భావాలకు
కొత్త ఊపిరులు
పోస్తావు
వాడిన
కుసుమాలకు
పరిమళాలు
పూస్తావు
ఎండమావిలోనూ
నవవసంతమై
పలకరిస్తావు
నవస్వప్నానికి
తెరలేచే లోగా
మంచుముత్యమై
కరిగిపోతావు
మనసును
నిదురించనీయక
కవ్వింపులతో
దోబూచులాడతావు
కవ్వించకే
మనసా
నిదురపోనీ నా
మనసుని
