ఇలా అయితే ఎలా
ఎంత వారించినా విననే
విననంటావు
అదిలించినా అదుపే
లేదని అంటావు
బెదిరించినా భయమే
లేదని అంటావు
ఒక్క క్షణం కుదురుగా
ఉండలేనని అంటావు
ప్రతినిమిషం అటో ఇటో
వెతుకుతూనే ఉంటావు
వేకువలో వెన్నెలను
కోరుకుంటావు
నింగిలో తారకలను
ఏరుకుంటానని మారాం చేస్తావు
ఒక పువ్వు నచ్చిందని వాలిపోతానని
ఉబలాటపడతావు
పువ్వు పువ్వుకూ
ముల్లున్నదని తెలుసుకోలేనంటావు
ఒక గాయం మాననే లేదు
మరో గాయం కోసం ఆరాటపడతావు
మనసా నీతో ఎలా వేగమంటావు
నిన్నే కారాగారంలో
దాచుకోమంటావు
మనసు మొరలు ఆలకించదు.
ReplyDeleteఅదే కదండీ సమస్యంతా
Delete