వందనం అభివందనం
నలుపూ తెలుపుల చిత్రం
కొత్త రంగులు
అద్దుకున్నట్లు...
నల్లముసుగేసిన నింగిలో
వేల తారకలు నవ్వినట్లు...
నిశ్చలమై నిలిచిన
కడలిలో
కొత్త కెరటాలు ఎగసిపడుతున్నట్లు ...
భావాలు మరిచిన మనసులో
కొత్త అక్షరాలు
మొలిచినట్లు ...
జీవం లేక పగిలిన
పెదాలపై
కొత్త నవ్వులు
మెరిసినట్లు ...
అచేతనమైన దేహంలో
కొత్త ఊపిర్లు
పోసినట్లు ...
అమావాస్య నిండిన
పయనంలో
నిండు పున్నమి
ఉదయించినట్లు ...
వెన్నెల వెలుగువై
ప్రభాత సుందరివై
మైమరిపించే మంజీరనాదమై
మనసును తడిమిన
నిజజీవిత నాయికా
మనస్వినివై పరిమళించిన
అభిసారికా
వందనం
అభివందనం ...
ReplyDeleteపంచరంగుల కలయిక మీ మనసు :)
ధన్యవాదములు జీ
Deletethank you
ReplyDelete