బాల్యమా ఐ లవ్ యూ
ఆకాశం పందిరికింద
నేలమీద దుప్పటి వేసి
చుక్కలను లెక్కిస్తూ
పాలపుంతలతో ఆడుకుని
అలసిసొలసి నిద్దురపోయే
ఆ వెన్నెల రాత్రులు
కనులముందు
తారాడుతున్నాయి ...
ఊరగుట్టకింద మామిడి
తోపులో
కాయలు కోస్తుంటే
తోటమాలి అదిరింపులకు
పరుగులు తీస్తే మోకాలి
చిప్పలు పగిలిన
ఆ మండుటెండలు ఇంకా
ఒంటిని తాకుతూనే ఉన్నాయి ...
చినుకు చినుకుతో
పోటీపడుతూ ఆకాశాన్ని అందుకోవాలని
చెరువులోని చేపలు చేసే
విన్యాసాలు
ఇంకా కనురెప్పలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి...
గిల్లి దండాలు గిల్లి
కజ్జాలు
అమ్మా నాన్నలు చేసే
బడిత పూజలు
అన్నీ మరిచి మళ్ళీ
వీధిలోకి మా అల్లరి అడుగులు
మనసులో ఇంకా
గిలిగింతలు రేపుతూనే ఉన్నాయి
ఒక్కసారి గంతంలోకి
తొంగి చూసిన మనసుకు
చిననాటి అనుభవాలు
వాసంత సమీరాలై పలకరించాయి
జీవన సమరంలో అందరున్నా
అనామకుడిగా మారిన నాకు
మళ్ళీ బాల్యంలోకి
పరుగులు తీయాలని ఉంది
No comments:
Post a Comment