నేనే దేవుడిని
అవును నేనే దేవుడిని
మనిషిని ప్రేమిస్తా
మంచిని ఆరాధిస్తా
చెడును ధ్వేశిస్తా
మతాన్ని చూడను
కులాన్ని పట్టించుకోను
జేబులో చిల్లిగవ్వ
లేకున్నా
మాటసాయంలో ముందుంటా
రాములోరి గుడిలో
అత్యాచారాలను ఆపని
శక్తి
అల్లా పేరుతో
మారణహోమాన్ని ఆపలేని భక్తి
శిలువపై అచేతనంగా
వైరాగ్యమూర్తి
స్పందించటమే చేతకాని
మీ దేవుళ్ళకన్నా
మనిషిని మనిషిగా
ప్రేమించే మనిషి కదా దేవుడు
అందుకే నేను
దేవుడిని...
No comments:
Post a Comment