ఇలా అలా
ఇలా ఎందుకు జరిగింది
అలా ఎందుకు జరగలేదు
ఇలా జరగకపోతే అలా జరిగేదేమో...
అలా జరిగినా ఇలా జరిగినా ఎందుకు జరిగిందని ఆలోచించను
అలా జరిగినా ఇలా జరిగినా ఇదే నా జీవితం...
ఇలా జరిగితే కుంగిపోను అలా జరిగితే పొంగిపోను
కానీ ఏ ఘడియనూ మరిచిపోను
వెన్నెల కురిసినా చీకటి ముసిరినా
ప్రతిఘడియలోనూ
నేను జీవిస్తున్నా గనుక...
No comments:
Post a Comment