నిర్లిప్తత
నా గుండె కవాటంలో గడ్డకట్టిన రుధిరం లావాలా ఉబికివస్తున్నదెందుకు
పువ్వులాంటి నా అక్షరం
ముల్లులా నాకే గుచ్చుకుంటున్నదెందుకు
వెండివెన్నెల చందమామ నా హృదయం
అమావాస్య రంగులను అద్దుకున్నదెందుకు
ఏమో ఏమయిందో గాని
నేను మాత్రం నిర్లిప్తమనస్కుడినై తిలకిస్తున్నా
క్షణక్షణం రంగులు మారుస్తున్న
కాలాన్ని...
No comments:
Post a Comment