అభిషేకం చేయనా కన్నీటితో..
అలసినది దేహమే అని అనుకున్నా
మనసు పొరలో ఏదో ఆక్రందన
వినిపిస్తోంది లీలగా
అలసిన దేహం పడి లేస్తూ
పోరాడుతోంది
మనసు మాత్రం ఓటమికి
తలవంచుతోంది
ఈ లోకం ముందు అస్త్రసన్యాసం తప్పదంటోంది
ఉరుములు పిడుగుల వర్షంలో
ఛిద్రం చేసే తూటాల గాయంతో
నరాలు తెగేలా విలపిస్తోంది మనసు
ఏమని ఓదార్చను నా మనసుని
కన్నీటితో అభిషేకం చేయగలను తప్ప...
No comments:
Post a Comment