జలదరించిన గుండె...
పువ్వులు ముల్లులై
గుచ్చుకుంటున్నాయి...
రాళ్ళు రప్పలతో
పరిచిన ముళ్ళతో
పువ్వులు పోటీ పడుతున్నాయి...
పూలూ ముళ్ళూ
కలిసిమెలిసి
నా పాదాలను ముద్దాడుతున్నాయి...
రక్తం ఓడుతున్నా...
సత్తువ నశిస్తున్నా
నా పయనం ఆగలేదు...
నా పాదాలు ముందుకే పడుతున్నాయి...
కళ్ళలో వెలుగు
మాయమవుతోంది...
చల్లదనం ఆవిరై
వేడిగాలి తనువును
తాగేస్తోంది...
చెయ్యి పెట్టి ఎవరో
ఊపిరిని తోడేసినట్లు
శ్వాస భారమవుతోంది...
అయినా నా అడుగులు ఆగలేదు...
ఎందుకిలా
ఏమయ్యింది నాకు...
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను...
నా అడుగుల జాడల్లో
నీ అడుగులు
కనిపించలేదు...
చూసావా
నీ తోడు లేకపోతే
నా ప్రయాణం
ఎంత నరకమో...
ఇది ఒక ఊహే అయినా
ఊహించుకుంటేనే
గుండె
జలదరిస్తోంది...
కలకాలం
నా అడుగుల జాడై
ఉండిపోతావు కదూ
మనస్వినీ...
