దేవుడు లేని లోకం
చిన్ని చిన్ని ఆశ
బలమైన ఆకాంక్షల సమరంలో ఊపిరులద్దుకున్న
ఓ స్వప్నం రెక్కలు విచ్చుకుంటోంది
దేవుడు లేని లోకంలో
విహరించాలనీ...
అందమైన తీయని పలుకుల పుస్తకాల మాటున పొంచి
ఉన్న కసి కత్తులకు చిక్కకుండా ఎగిరిపోవాలనీ...
కల్పనలో తప్ప కానరాని దేవుడికోసం
దేవుడిలాంటి మనిషిని రాక్షసుడిగా మార్చిన
ఆ పుస్తకాల పేజీలో మగ్గిపోక
స్వచ్ఛమైన జగతిలో పాదం మోపాలనీ...
మనోనేత్రాలు శోధిస్తున్నాయ్
దేవుడు కాదు
దేవుడి లాంటి మనిషి ఎక్కడా అనీ...
మనసు రెక్కలు ఆరాటపడుతున్నాయ్ మనస్వినీ
దేవుడు లేని లోకంవైపు ఎగిరిపోవాలనీ...