Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 20 March 2019

వెలుగుతూనే ఉన్నా


వెలుగుతూనే ఉన్నా
వెన్నెల వానలో తడియారుతూ

వెండి రంగులు పులుముకున్నానా...
అగ్గిచినుకుల వర్షంలో దేహాన్ని మండిస్తూ 
అగ్నిశిఖలా వెలుగుతున్నానా...
వెలుగూ వెలుగూ ఒకటేనా ...
ఏమో నేనైతే వెలుగుతూనే ఉన్నా...



Wednesday 13 March 2019

నేను ఆనందంగానే ఉన్నా..


నేను ఆనందంగానే ఉన్నా..
అక్షరాలు రాసుకుంటున్నా

భావాలను సమాధి చేస్తూ. .
వాడిన పెదాలను మెరిపిస్తున్నా
కాగితం రంగులు అద్దుకుంటూ...
నిండుపున్నమిలా వెలుగుతూ ఉన్నా 
కటిక చీకటిని మనసులో దాచుకుంటూ. .
మంచివాడిలా కనిపిస్తున్నా
నాలో దానవుడిని నిద్రపుచ్చుతూ..
నాది రాచమార్గమేనని నమ్మిస్తున్నా 
పాదాలను చీల్చే ముళ్ళను ముద్దాడుతూ..
అందుకే నేనింకా ఆనందంగా ఉన్నా ..