సమయాన్ని దోచుకుంటా
ఓ సమయమా
నువ్వెంత వేగంగా పయనించినా
ఎన్ని ఎత్తు పల్లాలు రుచి
చూపినా
జీవితాన్ని ఎన్ని మలుపులు
తిప్పినా
ఎన్ని ముళ్ళు గుండెలో గుచ్చినా
నీనుంచి అప్పుడప్పుడూ
మధురక్షణాలు దోచుకుంటూనే
ఉంటా
నీ గాంభీర్యానికి చిరునవ్వులు
అద్దుతూనే ఉంటా
నీ వేగానికి కళ్లెం వేస్తూనే
ఉంటా
ఎందుకంటే నేను ఆనందాల దొంగను
నిన్ను కొల్లగొడుతూనే ఉంటా...
No comments:
Post a Comment