ప్రపంచమా ఉలిక్కిపడు
తిరుగుబాటు ఒక స్వప్నమనీ
ప్రజాగ్రహం ఇక రానే రాదనీ
విప్లవం పుస్తకాలకే పరిమితమనీ
వ్యక్తిపూజ శిరోధార్యమని
మత్తులోపడి మునిగిపోయిన
యువతరమా ఉలిక్కిపడు
లంకేయుల సమరనాదం ప్రపంచాన్ని
వణికిస్తోంది
కడుపు మండితే
జెండాలు ఎజెండాలు లేకున్నా
తిరుగుబాటు తప్పదని పిడికిలి బిగిస్తోంది
ఏ నాయకుడు లేకున్నా తనే
నాయకుడై నిలుస్తోంది
ఏ జెండా ఎగురకున్నా
లంకేషుడి జెండా తలదించుకున్నది
లంకేయుల స్పూర్తి
జగతికి దీపమై వెలుగుతోంది...
No comments:
Post a Comment