Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 15 January 2015

ఎందుకు ప్రియమైనావు...



ఎందుకు ప్రియమైనావు...


ఎవరు నీవు...
దివి నుంచి భువికి దిగి వచ్చినావు...
ఇంధ్రలోకపు దేవకన్యవా...
చందమామ గారాల పట్టివా...
ఎవరు నీవు...
నా మనోవీణను మీటుతున్నావు...
సాగరమధనంలో  పుట్టిన అమృతధారవా...
సముద్రుడి ముద్దుల తనయవా...
సూర్యుని నుండి రాలిన అగ్నిశిఖవా...
నీలిమేఘాల స్వాతిచినుకువా...
గీతలోని సారాంశానివా...
జీసస్ ప్రవచనానివా...
అల్లా ప్రసాదించిన దివ్యసందేశానివా...
ఎవరు నీవు...
పూజా ఫలానివా...
నమాజులోని ఇనాయత్ వా...
ఎందుకు నీవు ...
సమస్త ప్రకృతి కంటే...
ప్రియమైనావు...
మనస్వినీ...

2 comments: