Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 4 January 2015

మేఘాల్లో నువ్వే...

మేఘాల్లో నువ్వే...

నీలాకాశం వైపు చూడు...
దేవుడు గీసిన ...
అందమైన చిత్రాలకు ...
కాన్వాసులా ...
నీలి వర్ణపు తెరలా...
మనసును దోచుకునే...
ఆకాశంలో...
అక్కడక్కడా మబ్బు తునకలు...
ఒకదానిని ఒకటి...
పెనవేసుకు పోతుంటే...
ఆ తెల్లని మబ్బుల ...
కలయికలో...
రూపు దిద్దుకునే ...
ఆకృతులలో...
జాగ్రత్తగా పరికిస్తే...
మనసుకు నచ్చిన ...
బొమ్మలు కనువిందు చేయవా...
మనసుపెట్టి చూస్తే...
ఆ మేఘమాలికల్లో ...
కనిపించేది ...
నీ దివ్య సుందర రూపం కాదా...
మనస్వినీ...

No comments:

Post a Comment