Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 25 January 2015

విషవలయం...


విషవలయం...


నాదీ నీదీ యన్న విషవలయం
ఈ జీవితం...
నాతో ఉన్నదంతా
నాది కాదు...
నాతో లేనిది పరాయికాదు...
నాదన్నది కోల్పోలేను...
పరాయిది పొందలేను...
నాదేదో కానిదేదో
తెలియని అమాయకుడను...
అంతా నాదేననే
మూర్ఖుడను...
నాది నాదికాకుండా
పరాయిదిలా
కరిగిపోతూ
దూరమవుతూ ఉంటే
తట్టుకోలేని
కన్నీటి చుక్కను నేను ...
నాదన్నది నన్నే
చంపేస్తే
నువ్వు లేనే లేవంటూ
ఎగతాళి చేస్తే
ఆగిపోయే శ్వాసను నేను...
నాదేదో తెలుసుకోలేక
కానిదేదో చెప్పుకోలేక
మనసును మనసులోనే
సమాధి చేసుకునే
రాతిబండను నేను ...
నాదన్నది నీదేనని
నీదన్నది నాదేనని
తెలియచేప్పలేక
కుమిలిపోయే
పిచ్చిమనిషిని నేను...
అంతా నేనేనని
నీలోనే నేననీ
చెప్పాలని ఉన్నా
స్వీకరించని
మనసే లేనప్పుడు
నాదీ నీదీయనేది
ఏమున్నది ఈ లోకంలో...
అంతా విషవలయం కాదా
మనస్వినీ...

No comments:

Post a Comment