Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 9 January 2015

అంతా నీ ఇష్టం...అంతా నీ ఇష్టం...


ధరహాసం నీవైతే...
మందహాసం నేనవుతా...
అధరామృతం ...
విషంగా మారితే...
నిర్జీవం నేనవుతా...
సులోచనాలే నీవైతే...
కనురెప్పల నీడనే నేనవుతా...
కంటిపాపలు ...
అగ్నిగుండాలుగా మారితే...
నిప్పుల కొలిమిలో ...
నివురుగా మిగిలిపోతా...
గుండె గుడిలో దీపం నీవైతే...
ఆ దీపానికి చమురు నేనిస్తా...
కల్లోల కడలి మానసమైతే...
ఎగసిపడే అలను నేనవుతా...
చెలరేగే అలల్లో ...
రాలిపడే ఇసుకను నేనవుతా...
మయూర నడకవు నీవైతే...
నీ పాదాలకు మంజీర నాదం నేనవుతా...
రుద్ర నాట్యం నీవే అయితే...
రాలిపడిన మువ్వను నేనవుతా...
ఇది మరణశాసనమో ...
జీవనవేదమో...
అంతా నీ ఇష్టం ...
మనస్వినీ...

No comments:

Post a Comment