Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 12 January 2015

సమాజమంటే...



సమాజమంటే...

సమాజమంటే...
ఏమిటీ సమాజం...
అది మనుషుల సమూహమా...
మనసే లేని ...
పిచ్చిమూకల రాజ్యమా...
ఎలా ఉంటుంది సమాజం...
సమాజమే మనల్ని ...
కలిపిందా...
మన తొలి పరిచయానికి ...
ప్రాణం పోసిందా ...
మన సంగమానికి....
పానుపులు వేసిందా...
పరిణయానికి ...
పందిరి వేసిందా...
ఏం చేసింది ...
ఈ సమాజం...
ఎక్కడుంది ఈ సమాజం...
మనకేమిచ్చింది...
సిగ్గులేని సమాజం...
ఎందుకు ఆలోచించాలి...
ఏమైతేనేం ఈ సమాజం...
కలిపేందుకు ...
ముందుకు రాని ...
సమాజం...
విడదీయాలనే చూసింది...
మానవతకు మాయని మచ్చలా...
మిగిలిన సమాజం కోసం...
బంధాలు కలుపుకోవాలా...
విడదీసుకోవాలా...
ఇది ఆలోచించుకునేంత...
పిచ్చివాడిని కాదు నేను...
మనస్వినీ...

No comments:

Post a Comment