Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 22 January 2015

వెన్నెల లేని నెలవంకను...



వెన్నెల లేని నెలవంకను...


చలనమే లేని జీవం నేను...
సుగంధమే లేని పువ్వును నేను...
వెలుతురే లేని కన్నును నేను...
నవ్వులే లేని పెదవిని నేను...
వెన్నెల కురిపించని
నెలవంకను నేను...
కాంతిలేని సూరీడుని నేను...
శ్వాసే లేని
ఊపిరిని నేను...
నేనున్నాను....
కాని నేను లేనే లేను...
నేను మాట్లాడుతున్నాను ...
అర్ధమే లేని పలుకులు నావి...
నవ్వుతున్నాను నేను...
పువ్వులే రువ్వని నవ్వులు నావి...
నడుస్తూనే ఉన్నాను...
గమ్యమే తెలియని
బాటసారిని నేను...                                              
అందరిలోనే ఉన్నాను...
ఎవరూలేని
ఒంటరినే నేను...
నేనేమీటో నాకే తెలియదు
మనస్వినీ...

No comments:

Post a Comment