Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 8 January 2015

పక్షినైనా కాకపోతిని...



పక్షినైనా కాకపోతిని...


అక్కడ నుంచి ఇక్కడ...
ఇక్కడ లేకపోతే...
అక్కడ...
అక్కడా కుదరకపోతే...
మరెక్కడో...
మరెక్కడా లేకపోతే...
మళ్ళీ ఇక్కడే...
అవును ...
అక్కడ కాకపోతే ...
ఇక్కడే...
తిండి గింజల ఆరాటం...
బతుకు కోసం పోరాటం...
ప్రతి గమ్యం ఒక సోపానం...
చిట్టడివి నుంచి...
కీకారణ్యం...
సముద్రం కాకపోతే...
సెలయేటి తీరం...
ఈ దేశం కాకుంటే...
మరో దేశం...
దొరుకుతోంది ఆవాసం...
చిగురిస్తోంది నవ వసంతం...
మానవమాత్రులమైన...
మనకంటే...
వలస పక్షులే నయం కదా...
మనస్వినీ...

No comments:

Post a Comment