Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 7 January 2015

మల్లెలు చెబుతున్నాయి...



మల్లెలు చెబుతున్నాయి...


కురుల విరులను...
మరింతగా  సింగారిస్తూ...
జవ్వని రతీదేవి...
సోయగాలను మరిపిస్తూ...
సిగ్గు దొంతరలు...
అడ్డుకున్న వేళ...
కనులలో కనులు కలుపలేక...
గుండెల్లో సూటిగా చూడలేక...
మొహం దాచుకున్నా...
మోహం దాగునా...
నీ కన్నుల్లో  ఆరాటం...
ఎరుపెక్కిన పెదాల్లో...
ప్రకంపనల దరహాసం...
మునివేళ్ళ తాకిడికోసం...
పొంగిన గుండెల ఉబలాటం...
నువ్వెంతగా దాచుకున్నా...
నువ్వెంతగా కాదంటున్నా...
రెండు చేతుల్లో వణుకుతున్న ....
పెదాలను దాచుకున్నా ...
కాదన్నా అవునని చెప్పే ...
నీ మనసులోని  మతలబులను...
నీ సిగలో ఒదిగిన ...
మరుమల్లెలు...
విరబూసిన నవ్వులతో...
నాకు అన్నీ చెప్పేస్తున్నాయి ...
మనస్వినీ...

No comments:

Post a Comment