Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 10 January 2015

అవి మన అనుభవాలే...



అవి మన అనుభవాలే...


నీ సుతి మెత్తని ...
మునివేళ్లను అలా ...
సుతారంగా...
ఆడించకు...
నీ వేళ్ళ స్పర్శకు...
నా అక్షరాలు నిగ్రహం ...
కోల్పోతున్నాయి...
నీ తనువులోని...
వెచ్చదనానికి అవి ...
చెదిరిపోతున్నాయి...
నీకై నీకోసమే...
రాసుకున్న నా అక్షరాలను...
నువ్వే రెచ్చగొట్టకు...
నీ కర స్పర్శలో...
రగులుతున్న అక్షరాలు...
అదుపుతప్పితే...
నీ మనసూ తనువూ...
లయ తప్పటం ఖాయం...
అది పుస్తకం కాదు ...
నా మనో ఫలకం...
ఆ అక్షరాలు ...
మన అనుభవాలే...
మనస్వినీ...

No comments:

Post a Comment