Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 15 January 2015

మృతసంజీవనివే...



మృతసంజీవనివే...



నిజమే ...
నిజంగా నిజమే...
మరణం నా కళ్ళ ముందు ...
నిలబడింది...
ఏ క్షణమైనా నన్ను...
వాటేసుకోవాలని...
నన్ను తనలో ...
కలిపేసుకోవాలనీ...
నా వైపు దూసుకు వచ్చింది...
క్షణాలు లెక్కించా నేను...
ఘడియలే మిగిలాయి...
ఊపిరి ఆగేందుకు...
అనంతవాయువుల్లో ...
కలిసిపోయేందుకు...
చిన్న స్పర్శ...
అవును అది కర స్పర్షే...
ఆ స్పర్శ ...
తనువులోని అణువణువునూ...
తట్టిలేపింది...
ఆ క్షణంలో ...
ఆ కన్నుల్లో నాకు ...
ఆవేశం కనిపించలేదు...
రోజూ కురిసే ...
అనర్ధాల వర్షం కనిపించలేదు...
అంతులేని అనురాగం...
హద్దులు లేని అనుబంధం ...
తొణికిసలాడింది...
ఆ స్పర్శ...
ఆ అనురాగం...
ఆ అనుబంధం చూసి...
మరణం చిన్నబోయింది...
అవును ఆ స్పర్శ ...
మరణానికే...
జీవం నేర్పింది...
నేను జీవం పోసుకున్న ...
ఘడియలలోనే ...
నిర్జీవం వైపు నడిచినా...
అవే ఘడియల్లో ...
జీవం పోసిన నువ్వు...
మృతసంజీవనివే ...
కదా...
మనస్వినీ...

No comments:

Post a Comment