Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 21 January 2015

మనసు మాట్లాడుతూనే ఉంది...



మనసు మాట్లాడుతూనే ఉంది...

అవును నాలో  
మాటలు తగ్గిపోయాయి...
పలుకులకు బదులు
మౌనం ఆవరించింది...
నీ పక్కనే కూర్చున్నా...
నిన్నే చూస్తున్నా...
నీ గలల మాటలు
వింటూనే ఉన్నా...
మౌనంగానే వింటున్నా
నీ మాటలకు
సవ్వడినవుతున్నా...
నీ పలుకులకు
భావాన్ని అవుతున్నా...
నీ భావాలకు
భాష్యం అవుతున్నా...
అయినా అన్నీ
మౌనంగానే వింటున్నా...
నా మాటలు
పెదాలు దాటి రాకున్నా...
నా మనసు మాత్రం
నీతో మాట్లాడుతూనే ఉంది
మనస్వినీ...

No comments:

Post a Comment