Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 18 January 2015

ఒక్కసారి చెప్పవా...


ఒక్కసారి చెప్పవా...


ఓ విరిసిన సౌందర్యమా...
అందానికే నవ భాష్యమా...
పద్మంలా వికసించిన
నీ మోములో  ఎన్నెన్ని భావాలు...
ఏవో తెలియని అంతరంగాలు ...
పువ్వు రెక్కలను సుతారంగా స్పృశిస్తూ
ఎదో తెలియని లోకంలో విహరిస్తున్నావేమి...
ఉబికి వస్తున్న జ్ఞాపకాల దొంతరలు...
అల్లరి పెడుతున్న గిలిగింతలు...
నీ ముఖారవిందం దాచగలదా...
ఏముంది నీ తలంపులో...
ఏం దాస్తున్నావు మనసులో...
బయటకు రానీయవా...
చెలికాడి కవ్వింతలా...
నిశి పరదాల సరదాలా...
ఏం దాచాలని ఆరాటం...
అయినా దాగవే భావాలు...
నీ మోములో
వాలిన కనురెప్పల్లో
విచ్చుకున్న పెదాల రేకుల్లో
నవ్వుతున్న ఆ మరుమల్లెల్లో
అన్నీ కనిపిస్తూనే ఉన్నాయిగా...
ఒక్కసారి విడమర్చి చెప్పలేవా...
అక్షరాలుగా అల్లుకుంటా....

No comments:

Post a Comment