పావురంతో ప్రేమలేఖ
కాకితో కబురు పంపమాకు
అది రెండుముక్కలు
చెప్పి ఎగిరిపోతుంది
పావురంతో ప్రేమలేఖ
పంపు
అది నీ మనసు మొత్తం
చదివి వినిపిస్తుంది
నీలి మేఘమాలికలను
నమ్ముకోమాకు
అవి ఉరుములై మెరిసి
మాయమైపోతాయి
చల్లని వెన్నెల
జాబిలికి మనసు కథలు చెప్పు
అవి రేయంతా నాతోనే ఉండిపోతాయి
నీతోటలో పూచిన
గులాబీలను పంపమాకు
రెండు ఘడియల్లోనే అవి
వాడిపోతాయి
నీ మనసులో ఉదయించిన అక్షర
పుష్పాలను పంపు
అవి నా మనసులో నిత్యం పరిమళిస్తూనే
ఉంటాయి
నిన్ను సుతారంగా తాకి
జారిపోతున్న
పిల్లగాలులను
అదిలించమాకు
అవి నీ శ్వాసను
అరువుతెచ్చి నాకు
కొత్త ఊపిర్లు
అందిస్తూనే ఉంటాయి
No comments:
Post a Comment