అంతా నిజమే
నీ ప్రేమ నిజం
కాకపోవచ్చు
నేను ప్రేమించింది
నిజమే
నీ అనురాగం ఒక మాయ
కావచ్చు
నా అనుభూతులన్నీ
నిజాలే
నీ కనులలో నారూపం చెదిరిపోవచ్చు
నా కళ్ళలో నీ రూపం మాయకాదు
కలలన్నీ కాల్పనిక
గాథలే అని నువ్వు సరిపెట్టుకోవచ్చు
నా కనురెప్పలపై కలల
తాలూకు తడి ఇంకా ఆరనే లేదు
అన్నీ నువ్వు
తేలికగానే మరిచిపోవచ్చు
నా జ్ఞాపకాలన్నీ పచ్చి
నిజాలే
No comments:
Post a Comment