చలిమంటలు వేసి పో
శరదృతువు సరసమాడుతోంది
వడివడిగా వస్తున్న
హేమంతం గుబులురేపుతోంది
శిశిరం ఆలోచనే కలవరం
కలిగిస్తోంది
రుతువులన్నీ కలిసి
కత్తికడుతున్నాయి
మంచు తీగలుగా మారిన
శీతల శరములు దేహాన్ని
గుచ్చుకుంటున్నాయి
ఘనీభవించిన రుధిరం కరుగుతూ
బుసలు కొడుతోంది
శరతుడికే సవాలు
విసురుతూ
మెరుపుతీగవై కదిలిరా
హేమంతుడిని
నిలువరిస్తూ
పరువాల సెగలతో అభిసారికవై
దరికి రా
వయసు సమరానికి శంఖం
ఊది
సొగసు వెలుగులతో కాగడా
వెలిగించి
తనువుల రణంతో అగ్గిని
పుట్టించి
శిశిరాన్నీ కరిగించి
పో
ఒంటరిదైన మనసుకు
జతలేని తనువుకు
ఎవరో తెలియని నువ్వే
నేనై
చలిమంటలు వేసి పో
This comment has been removed by a blog administrator.
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పితా జీ
ReplyDelete