Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 15 February 2015

HAPPY BIRTHDAY TO YOU



HAPPY BIRTHDAY TO YOU
 
సంధ్యా సమయం లో వేగుచుక్కవై
తొలిపొద్దు పొడిచినట్లు....
బీడువారిన మనోసీమలో
అమృతవర్షం కురిసినట్లు....
వాడిన వనం లో వసంతమై
చిగురించినట్లు....
మెరుపులే తెలియని తారకకు
నెలవంక వెలుగులు అద్దినట్లు...
దివి నుంచి భువికి దిగివచ్చావా...
మేఘమై తరలి వచ్చావా ....
నా జీవనాన్ని పునీతం చేశావు...
ఊహాసుందరి కలలను
నిజం చేస్తూ ...
మనస్వినివై...
శ్రీమతివై ...
అందమైన బహుమతివై...
నాలోకంలోకి పాదం మోపావు...
జీవన సంధ్యలో వెలుగుబాటను
పరిచిన నీ పాద పద్మములకు...
శిరస్సు వంచి ప్రణమిల్లుతోంది
నా మనసు..
నేలమీది జాబిల్లిలా నడియాడే
నీవు శతవసంతాలు వర్ధిల్లాలనీ ...
అభిలషిస్తూ...
నా మనసు నీకు చెబుతోంది
జన్మదిన శుభాకాంక్షలు
మనస్వినీ .....

(నా శ్రీమతి వాణి శ్రీవిద్య జన్మదినం సందర్బంగా)

3 comments:

  1. నా శుభాకాంక్షలు కూడా..

    ReplyDelete
  2. hav a great time boss

    ReplyDelete
  3. థాంక్స్ పద్మార్పితాజీ....

    ReplyDelete