Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 8 February 2015

ప్రభంజనమై లేచి వస్తా...



ప్రభంజనమై లేచి వస్తా...


మిన్ను విరిగి మీద పడినా
చలించను నేను...
అగ్ని వర్షం కురిసినా
బెదరను నేను...
సముద్రం పొంగి నింగిలో
కలిసిపోయినా
చెదరను నేను...
సూర్యుడే కరిగిపోయినా
చందమామే రాలిపోయినా
తొణకను నేను...
అగ్ని వర్షం పూలవానే నాకు..
కడలి పొంగులు
సయ్యాటలే నాకు...
సూర్య చంద్రమలు లేకున్నా
నీ కన్నులే వెలుగులు నాకు...
గుండె నిండా పిలిచి చూడు
మరణాన్ని జయించి
ప్రభంజనమై
లేచివస్తా
మనస్వినీ...

No comments:

Post a Comment