Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 18 February 2015

నువ్వు వస్తావనీ....

 
నువ్వు వస్తావనీ.... 


భారమైన నా మనస్సు
నీ
  సాంగత్యం కోరుకుంటుంది...
మాటలే రాని నా మౌనం
నీ మాటలనే కోరుకుంటుంది...
నా అడుగులు భారమయితే
నీ తోడునే కోరుకుంటాయి....
నా శ్వాస
  కరిగిపోతూ
నీ ఊపిరినే కోరుకుంటుంది...
నువ్వు లేని వసంతం
వాడిన వనంలా కనిపిస్తుంది...
నీవు లేని వెన్నెల
మంటలనే రేపుతుంది....
నీ ఎడబాటులోని ప్రతిక్షణం
ఒక యుగంలా
  అనిపిస్తుంది....
నువ్వు త్వరలోనే తిరిగి వస్తావన్న ఆశ
ప్రాణవాయువై నిలుస్తుంది....
వస్తావు
  కదూ!
వచ్చి
  పలకరిస్తావు కదూ!
నువ్వొస్తావని
చంద్రుని కోసం చకోరంలా
వేచి చూస్తూనే ఉంటాను
మనస్వినీ.......



No comments:

Post a Comment