Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 21 February 2015

అనుభవాల ఒడిలో...



అనుభవాల ఒడిలో...


అనుభవాల ఒడిలో
జ్ఞాపకాల సుడిలో
సాగే పయనమే
జీవితం....

మంచు ముద్దలా
కరిగిపోతున్న  కాలంలో
అనుభవాలు శిలలుగా
మిగిలిపోతుంటే
పయనించక తప్పని సమయం...

శిలలుగా మారిన
అనుభవాల్లో
పనికిరాని చిల్లర రాళ్ళు
కొన్నిఉంటే

అందమైన అనుభవాలను
ఆకృతిలా మలుచుకున్న
పాలరాతి శిలలు ఎన్నెన్నో...

పాలరాతి అనుభవాలు
మధుర జ్ఞాపకాలు
ఇవే నాజీవన గమనానికి
ఆధారాలు ....

నీ ప్రతి అనుభవం నాకు
జీవనాధారమే
మనస్వినీ...

No comments:

Post a Comment