Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 12 February 2015

అనుభవం కాదు అనుబంధం...



అనుభవం కాదు అనుబంధం...

ఆ క్షణం ఏమనిపించింది నాకు...
తొలిక్షణం చేయి పట్టుకున్న
నాలో ఏమిటా ఆలోచనలు...
ఈ సంగమం తొలి సంగమం...
ఈ సంగమం నిత్య సంగమమేనా
ప్రతిక్షణం ఈ అనుభూతి కావాల్సిందేనా నాకు...
అలా అనుకోలేదు నేను...
ఆ కలయిక మధురాతి మధురమే...
అయినా దానికి ప్రాధాన్యత
ఇవ్వలేదు నేను..
కలయికకు ముందూ
కలయికకు తరువాతా
నా మనసుముందు తెరుచుకున్న
నీ మనోపుస్తకం నచ్చింది నాకు...
ఆ మనసుకోసమే
పట్టిన చెయ్యిని విడిచేది
లేదని నిర్ణయించుకున్నా నేను   
నిన్నెలా వదులుకుంటా
మనస్వినీ....

No comments:

Post a Comment