Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 23 February 2015

కురులకెరటాలు...


కురులకెరటాలు...


సాగర కెరటాలకు
పోటీ పడే శిరోజాలు...

నిజంగా నిజమిది...
సముద్రుడి అలల నుంచి
రివ్వుమని దూసుకు వచ్చిన
పిల్లగాలులు...

పిల్లాగాలుల పలకరింతకు
అలలవోలే
నాట్యమాడిన కురులు...

ఇవి నేను గాంచిన సోయగాలు ...
ఆరోజు నాకు బాగా గురుతు...

విశాఖ తీరాన్ని
చేరుకున్న సమయం...

ఎవరితోనో
మాట్లాడుతున్న నీవు...

మాటలు అతనితోనే
చూపులే నావైపు...

నేనెక్కడ ఉన్నానో
ఏం చేస్తున్నానో
ఆ చూపులు నాకోసమే
వెదుకుతున్నాయి...

చేరువలోనే ఉన్న నేను...
ఆ చూపులను గమనిస్తున్నా
ఆ ఆత్రాన్ని అనుభవిస్తున్నా ...

ఆ తాపత్రయం
అనుభూతిని పొందుతున్నా ...

నేనేం చేస్తున్నానో తెలుసా...
దూరంగా నిన్నే చూస్తున్నా...

అప్పుడే గమనించాను నేను
అలలతో పోటీ పడుతున్న నిన్ను...

చల్లని పిల్లగాలులకు
నీ మేని పులకరింత ...

ఒద్దికగా ఉన్న నీకురులు
వాయువీచికలకు
లయబద్దంగా నర్తించటం
అది చూసి సాగర కెరటాలు
అలిగి పారిపోవటం...

ఇక చాలూ అనుకుని
నేను నీ చెంతకు చేరటం...
ఆన్నీ గురుతున్నాయి నాకు...

ఘడియలు
గంటలు
తేదీలు
ఏవీ గుర్తు లేకున్నా

నీ ప్రతి అనుభూతి
నా మనో ఫలకంపై
నిత్యం నర్తిస్తూనే ఉంటుంది
మనస్వినీ...

No comments:

Post a Comment