Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 1 February 2015

మల్లికల సందేశం...



మల్లికల సందేశం...

నీవు పంపిన సందేశం
అది ఒక రసధుని సంగీతం...
అదికాదు
పది పంక్తుల ఆరాటం...
అది
ఇరు తనువుల పోరాటం...
రసరమ్య ఘట్టనల ఆలవాలం...
ప్రతి అక్షరం
ఒక గులాబీలా
మరు మల్లియలా
మనసుపై అతర్లు చల్లుతూ
పలుకుతోంది ఆహ్వానం...
ప్రతి పంక్తి తలపుకు
తెస్తోంది
నీ అభిమానం ...
నాకై నీ ఆరాటం...
నీకై నా ఉబలాటం...
నీ సందేశంలో లీలగా
ఏదో పరిమళం
అది మన
తనువుల పోరులో
రాలిన చెమట గంధం...
కాకమ్మకు చెప్పావో...
చిలకమ్మను వేడుకున్నావో
మేఘాలను మచ్చిక చేసుకున్నావో
నాకు తెలియదు కానీ
నీ సందేశం
నాకు చేరింది...
నీ మనసును తట్టిలేపేందుకు
నా మనసు సదా సిద్ధం
మనస్వినీ...

No comments:

Post a Comment