Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 7 February 2015

పారిపోయిన సమయాన్ని కాదు...



పారిపోయిన సమయాన్ని కాదు...


మనసైన మనసుతో ఆహ్వానించు
మనసులో మనసునై ఎగిరి వస్తా...
కనులనిండా ప్రేమతో చూడు
కురిసే మేఘాన్నై తరలి వస్తా...
గుండె నిండా నమ్మకంతో పలకరించు
పడిలేచిన కెరటమై దూసుకువస్తా...
ఆప్యాయంగా చేతులు చాస్తే
నీలి నింగినై నేలకు దిగుతా...
అమృతం నిండిన పెదాలను పలికించు
విరిసిన గులాబీనై ఒడిలో వాలిపోతా...
నమ్మకంతో ఆదరిస్తే
నమ్మకానికే నమ్మకమై దరి చేరుతా...
నేనెక్కడికీ పోలేదు
నీలోనే ఉన్నా...
మనసుతో పిలిస్తే
నీ మనసులోనే కనిపిస్తా...
నేను పారిపోయిన
సమయాన్ని కాదు
మళ్ళీ మళ్ళీ రాను అనేందుకు
నీ కనులముందు నిలిచిన
వర్తమానాన్ని నేను
కళ్ళు తెరిచి చూడు
నేను నీతోనే ఉన్నా
మనస్వినీ...

2 comments: