Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 21 February 2015

నేనూ దేవుడినే...



నేనూ దేవుడినే...


నా రాత భగవద్గీత ...

నాభావం బైబిల్ ...

నా అక్షరం దివ్య ఖురాన్...

నా భాష్యం నిజం ...

నా ప్రేమ నిజం ...

నేను నిజం ...

నా కవితలు నిజం ...

నా ప్రతి అక్షరం అగ్ని కణం ....

నా నడతే నమాజు...

నా పలుకే వేదం ....

నా మాటే ప్రవచనం...

నా రాతలే ఒక మత గ్రంధం...

భూలోకంలోకి

పుస్తకాలు విసిరేసి

అవే ప్రామాణికాలంటూ

దేవుళ్ళుగా చెలామణి

అవుతూ ...

మసీదుల్లో

మందిరాలలో

చర్చి గోడలలో

చేతగానివాళ్ళుగా

మిగిలిపోయిన

అభూత కల్పనలే

నిజమైతే

రాతలు రాసుకునే

నేను

నా భావాలే

ప్రవిత్రాలని నమ్మే

నేనూ

దేవుడిని కాక

ఇంకేమవుతాను

మనస్వినీ....

No comments:

Post a Comment