కరిగిపోనీ నన్ను చుక్కలు చుక్కలుగా
ఎందుకింత తొందర ఈ
కాలానికి
గడియారం ముళ్ళు ఎందుకు
పరుగులు తీస్తున్నాయి...
సూరీడుకి ఇంత తొందర
ఎందుకు
చల్లని వెన్నెలను
తాగేసేందుకు ఉబలాటపడుతున్నాడు...
నిశిపరదాలు ఎందుకు తాము
కరుగుతూ
ప్రభాత కిరణాలకోసం తహతహలాడుతున్నాయి...
సమయం నా ఆరాటానికి
ఎందుకు హద్దులు గీస్తోంది
కాలం ఎందుకు
వేగిరపడుతున్నది ...
ఇప్పుడే వచ్చావు
అప్పుడే వెళ్ళిపోయే ఆత్రం ఎందుకు
నేనింకా మనసు నిండా
నిన్ను చూడనే లేదు...
ఘడియలను క్షణాలుగా నీ
బింకంలోనే కరిగించావు
వాలిన కనురెప్పల మాటున
సగం వెన్నెల రేయిని దోచేసావు...
నీ అధరమధురిమలను
మౌనానికే అరువిచ్చావు
ఎగసిపడే పరువాలతో
కవ్విస్తూ
దరికి చేరితే దూరం
జరుగుతావు...
మనసుతో మనసును
మాట్లాడించి
పొగరుతో సొగసును కరిగించి
వయసు సమరానికి నగారా
మోగితే
వేళకానే కాదంటూ కాలం
ఉరుకులు పెడుతోంది...
కాలమా నీకెందుకు ఇంత
తొందర
ఆగిపో పూబంతి నా చెంత
ఉండగా
కరిగిపోనీ నన్ను
చుక్కలు చుక్కలుగా ...
http://telanganasamacharam.online/english/single/47
ReplyDeleteకాలం ఎవరు ఆగమన్నా ఆగదు.
ReplyDeleteఅవునండీ
Deleteకాలాన్ని ఆగమని చేసేది ఏం లేదండీ..
ReplyDeleteఅందుకే కాలమిలా సాగిపోనీ అని పాడేసుకుందాం!
అంతేలే ఏం చేయగలం
Delete