Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 23 January 2015

గుండె మండాల్సిందే...

గుండె మండాల్సిందే...


ప్రతి క్షణం తలపులో
మెదులుతుంది...
ప్రతి మాటా వినిపిస్తుంది...
ప్రతి పలుకూ గుండెను
తాకుతూనే ఉంటుంది...
కలిసి పాడుకున్న
గీతాలన్నీ మంద్రంగా
వినిపిస్తూనే ఉంటాయి...
లతలా అల్లుకున్న
పల్లవులూ తనువును
తాకుతూ ఉంటాయి...
చేసుకున్న అల్లరులు...
మదిలో విరిసిన
పువ్వులూ
కొంటె విసుర్లూ...
పెదాలవిరుపులూ
అలకలూ బుజ్జగింపులూ
అన్నీ మనోగతంలో
మెదులుతూనే ఉంటాయి...
అయితే ఆ జ్ఞాపకాల
దొంతరలు
ఇప్పుడు గిలిగింతలు
పెట్టవు...
గుండెను మండిస్తాయి...
ఇప్పుడు గుండె మంటను
ఆస్వాదించాల్సిందే
మనస్వినీ...

No comments:

Post a Comment