Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 23 January 2015

నా మనసే నన్ను చంపేసింది...



నా మనసే నన్ను చంపేసింది...

ఓసి పిచ్చి మనసా...
ఎందుకిలా చేశావు...
నన్నెందుకు చంపేశావు...
ఆది నుంచి
అంతం దాకా
నిన్నే నమ్ముకున్నా...
ఊహలు విరిసిన నాటి నుంచి...
ఊహలు ఆవిరయ్యే దాకా
నీ మాటే విన్నా...
నా వారు
మనసైన వారు
ఎవరు ఎన్ని నిందలు వేసినా
నీ మార్గం వీడలేదు...
నా పయనం ఆపలేదు...
నీ అడుగుల జాడలే
నా మార్గమని నమ్ముకున్నా...
కరి మబ్బులు కమ్మినా
నీ వెలుగులనే
వెలుగుబాటలుగా
మలుచుకున్నా..
పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నా
పువ్వులుగానే
చెప్పుకున్నా...
నాకు మిగిలింది
ఏమిటే నా మనసా...
అవును ...
నా మనస్సు నన్నే
చంపుకుంది
మనస్వినీ...

No comments:

Post a Comment